Etela Rajender: మా ఇంటి చుట్టూ పోలీసుల‌ను పెట్టారు: ఈట‌ల భార్య జ‌మున‌

etela wife jamuna slams trs
  • ఎవరిని భయపెట్టడానికి ఇలా చేస్తున్నారు
  • ఇంటెలిజన్స్ వాళ్లు కూడా ఉన్నారు
  • గ‌తంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు
  • కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి  జ‌రిగిపోవాల‌న్న తీరుతో ఉన్నారు
త‌మ ఇంటి చుట్టూ పోలీసులు ఉండ‌డం ప‌ట్ల తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ భార్య జ‌మున మండిప‌డ్డారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ...  ఎవరిని భయపెట్టడానికి త‌మ ఇంటి చుట్టూ పోలీసుల‌ను పెట్టార‌ని ఆయ‌న నిల‌దీశారు.  తాము దొంగతనం చేశామా?  లేదా టెర్రరిస్టులమా? అని ఆమె ప్ర‌శ్నించారు.

ఇంటెలిజన్స్ వాళ్లకు కూడా త‌మ ఇంటి వ‌ద్దే డ్యూటీ వేశారని ఆమె అన్నారు. త‌మ బంధువుల‌ను కూడా ప్రశ్నిస్తున్నారని ఆమె అన్నారు. పాక్ సరిహద్దులో ఉన్నామా? తెలంగాణలో ఉన్నామా? అనే సందేహం వ‌స్తోంద‌ని ఆమె విమ‌ర్శించారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితి లేదని ఆమె చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సమైక్యవాద ప్రభుత్వం ఇలా చేయలేదని ఆమె చెప్పారు. అప్ప‌ట్లో ఇటువంటి పరిస్థితులు ఉండి ఉంటే యూనివర్సిటీల‌ విద్యార్థులు బయటకు వచ్చేవారే కాదని ఆమె చెప్పారు. తెలంగాణ ప్రజలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోయేవారని ఆమె చెప్పారు.

అప్ప‌టి ప్ర‌భుత్వం న్యాయ‌బ‌ద్ధంగా న‌డుచుకుంద‌ని, ఇప్ప‌టి ప్ర‌భుత్వం న్యాయం, ధర్మం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదనుకుంటే అది రాత్రికి రాత్రి  జ‌రిగిపోవాల‌న్న తీరుతో ఉన్నార‌ని అన్నారు.

Etela Rajender
TRS
Telangana

More Telugu News