చాలా పెద్ద రిస్క్ చేశామంటున్న రాశి ఖన్నా

29-05-2021 Sat 17:25
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో  'థ్యాంక్యూ'
  • నిర్మాతగా దిల్ రాజు
  • చైతూ జోడీగా రాశి ఖన్నా
  • ఇటలీ షెడ్యూల్ పూర్తి    
Thank you movie update
మొదటి నుంచి కూడా రాశి ఖన్నా అవకాశాల కోసం పరుగులు పెట్టినట్టుగా కనిపించలేదు. నెమ్మదిగా ఒక్కో అవకాశాన్ని అందుకుంటూనే ఆమె ముందుకు వెళ్లింది. అలాంటి రాశి ఖన్నా ఇటీవల కాస్త స్పీడు పెంచినట్టుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను వరకూ తమిళ సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులో ఆమె చేస్తున్న రెండు సినిమాల్లో 'థ్యాంక్యూ' ఒకటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ కొంతవరకూ షూటింగు పూర్తిచేసుకుని వచ్చింది.

తాజాగా రాశి ఖన్నా ఆ విషయాలను గురించి మాట్లాడుతూ ... "ఇండియాలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటిది షూటింగు కోసం ఏకంగా ఇటలీ వెళ్లవలసి వచ్చింది. ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉంది. అక్కడ కొన్ని లొకేషన్స్ లో కరోనా కేసులు బయటపడటంతో అనుమతులు లభించలేదు. దాంతో మా టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయోనని కంగారుపడ్డాం. అనుకున్నట్టుగా షూటింగును పూర్తిచేసుకుని హమ్మయ్య అనుకున్నాము" అని చెప్పుకొచ్చింది.