Jagital District: బాలిక గర్భం దాల్చడానికి, నాకు ఎలాంటి సంబంధం లేదు: రాయికల్ మున్సిపల్ ఛైర్మన్

I am not responsible for girls pregnancy says Raikal Municipal Chairman
  • జగిత్యాల జిల్లా రాయికల్ లో గర్భం దాల్చిన బాలిక
  • రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ హన్మాండ్లుపై అనుమానాలు
  • సొంత పార్టీ వారే అసత్య ప్రచారం చేస్తున్నారన్న హన్మాండ్లు
తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఒక బాలిక గర్భం దాల్చడం రాజకీయ రంగు పులుముకుంది. రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ మోర హన్మాండ్లు దీనికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హన్మాండ్లు స్పందిస్తూ, బాలిక గర్భం దాల్చడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

 సొంత పార్టీలో ఉన్నవారే తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 'అసలు నా వయసు ఏంటి... ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తానా?' అని ఆయన వాపోయారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, గర్భందాల్చిన బాలిక ప్రస్తుతం మాతా, శిశు సంక్షేమ శాఖ సంరక్షణలో ఉంది.
Jagital District
Girl
Pregnant
Hanmandlu

More Telugu News