Anagani Prasad: ఆనందయ్య మందును వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారు: టీడీపీ ఎమ్మెల్యే అనగాని ఆరోపణలు

YSRCP leaders selling Anandaiah medicine says Anagani
  • వాస్తవాలను వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాస్తోంది
  • వైసీపీ నేతలకు ఆయుర్వేదం గురించి ఏం తెలుసు?
  • ఆనందయ్యను నిర్బంధించడం ఎంత వరకు కరెక్ట్?
ఆయుర్వేద వైద్యంతో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆనందయ్యను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ మండిపడ్డారు. ఆనందయ్య మందుపై వైసీపీ ప్రభుత్వం వాస్తవాలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. అవినీతి వేదంలో నిష్ణాతులైన వైసీపీ నేతలకు ఆయుర్వేదం గురించి ఏం తెలుసని నిలదీశారు. ఆనందయ్య మందు విషయంలో వైసీపీ నేతలు ఎందుకు కలగజేసుకుంటున్నారని ప్రశ్నించారు.

ఆనందయ్య మందును వైసీపీ నేతలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజల కోసం నిస్వార్థంగా మందును అందిస్తున్న ఆనందయ్యను నిర్బంధంలో ఉంచడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో ఉంచాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఆనందయ్య మందుకు గుర్తింపు వస్తే... అది మన రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు.
Anagani Prasad
YSRCP
Anandaiah
Corona Virus

More Telugu News