Anantapuram: అనంతపురంలో ప్రైవేట్ ఆసుపత్రులకు జరిమానా విధించిన జాయింట్ కలెక్టర్

Anantapuram Joint Collector fines private hospitals
  • కరోనా పేషెంట్ల నుంచి భారీగా దోచుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులు
  • దోపిడీ చేస్తున్న ఆసుపత్రులపై అనంత జేసీ ఉక్కుపాదం
  • రెండోసారి తప్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
కరోనా నేపథ్యంలో రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు దోచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోపిడీకి పాల్పడుతున్న ఆసుపత్రులపై అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఉక్కుపాదం మోపారు. ప్రజలను దోచుకుంటున్న ఆసుపత్రులకు ఆమె భారీ జరిమానా విధించారు. నగరంలోని ఆశా ఆసుపత్రికి రూ. 3 లక్షలు, ఎస్ఆర్ ఆసుపత్రికి రూ. 2.55 లక్షలు, సాయిరత్న ఆసుపత్రికి రూ. 2.10 లక్షలు, ఎస్వీ ఆసుపత్రికి రూ. 2 లక్షలు ఫైన్ విధించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులను ఉపేక్షించబోమని చెప్పారు. అక్రమాలకు పాల్పడే ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 256 జీవో ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండోసారి అదే తప్పు చేస్తే... హాస్పిటల్స్ పై ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Anantapuram
Private Hospitals
Corona
Fine

More Telugu News