సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

29-05-2021 Sat 07:31
  • పూజ అభినయానికి ప్రభాస్ ఫిదా 
  • 'కింగ్ మేకర్' పాత్రలో మెగాస్టార్
  • బాలకృష్ణ సినిమాకి మరోసారి తమన్
Prabhas impressed with Pooja Hegde performance

*  కథానాయిక పూజ హెగ్డే అభినయానికి హీరో ప్రభాస్ ఫిదా అయిపోయాడట. ఇటీవల ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూశాడనీ, అందులో పూజ పెర్ఫార్మెన్స్  ప్రభాస్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. దాంతో పూజాపై ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడట.
*  మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'కింగ్ మేకర్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
*  నందమూరి బాలకృష్ణ నటించే చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మరోసారి పనిచేయనున్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'అఖండ' చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న సంగతి విదితమే. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఆ చిత్రానికి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారట.