Stock Market: నేడు కూడా లాభాలతోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • దేశంలో కరోనా కేసుల తగ్గుదల ప్రభావం
  • అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు
  • 307.66 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
  • 97.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Stock Markets closed in green today also

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాలతోనే పయనించాయి. దేశంలో కరోనా కేసులు బాగా తగ్గుముఖం పట్టడంతో పాటు, అంతర్జాతీయంగా సానుకూల   సంకేతాలు రావడంతో మార్కెట్లు జోష్ చూపించాయి. ఉదయం నుంచీ లాభాలలోనే కొనసాగిన ట్రేడింగ్ చివరికి భారీ లాభాలతోనే ముగిసింది. దీంతో 307.66 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 51422.88 వద్ద... 97.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,435.65 వద్ద ముగిశాయి.

ఈ క్రమంలో  నేటి సెషన్లో  రిలయన్స్, ఎల్&టీ ఫైనాన్స్, కెనరా బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎం&ఎం, ఎస్కార్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ తదితర షేర్లు లాభాలు దక్కించుకున్నాయి. ఇక టీవీఎస్ మోటార్, సన్ ఫార్మా, జీఎమ్మార్ ఇన్ఫ్రా, బీహెచ్ఈఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు చవిగొన్నాయి.

More Telugu News