YS Sharmila: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల స్పందన

YS Sharmila responds on NTR birth anniversary
  • నేడు ఎన్టీఆర్ 98వ జయంతి
  • యుగపురుషుడి స్మరణలో ప్రజానీకం
  • మహిళలకు ఆస్తి హక్కు కల్పించారన్న షర్మిల
  • రూ.2కే కిలోబియ్యంతో పేదల ఆకలి తీర్చారని కితాబు
యుగపురుషుడు నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయన స్మరణలో తమ స్పందనలు వెలిబుచ్చుతున్నారు. తాజాగా, దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.

నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని కొనియాడారు. బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని షర్మిల కీర్తించారు. ముఖ్యంగా, రెండు రూపాయలకే కిలోబియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చారని స్మరించుకున్నారు. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికలో సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ ఎన్టీఆర్ పై వచ్చిన కథనాన్ని కూడా ఆమె పంచుకున్నారు.
YS Sharmila
NTR
Birth Anniversary
Telangana
Andhra Pradesh

More Telugu News