స్వ‌యంగా శ్రీరామ దండకాన్ని ఆలపించిన బాల‌కృష్ణ‌.. వీడియో వైర‌ల్

28-05-2021 Fri 14:08
  • త‌న తండ్రి నందమూరి తారక రామారావు  జ‌యంతి సంద‌ర్భంగా పోస్ట్
  • తెలుగు గడప రంగు జెండాని ప్రతిగుండెలో ఎగురవేసిన కోదండ రాముడని వ్యాఖ్య
  • శ్రీరాముడిగా న‌టించిన ప‌లు సినిమాల్లోని ఫొటోల‌తో వీడియో
balaiah sings song

త‌న తండ్రి నందమూరి తారక రామారావు  శ్రీరాముడిగా న‌టించిన ప‌లు సినిమాల్లోని ఫొటోల‌తో రూపొందించిన ఓ వీడియోను ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ పోస్ట్ చేశారు. దానికి స్వ‌యంగా శ్రీరామ దండకాన్ని ఆలపించి జ‌త‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.  వెండితెర మీద ఉన్న కథానాయకుడిని ఆబాలగోపాలానికి ఆరాధ్యుడ్ని చేసిన ఆది అధినాయకుడు ఎన్టీఆర్ అని ఈ సంద‌ర్భంగా బాల‌య్య కొనియాడారు.

తన పేరులోనే ఉన్న తారస్థాయిని తన జీవిత సహచరిగా నడిపించిన తారక రాముడు అని చెప్పారు. తెలుగు గడప రంగు జెండాని ప్రతిగుండెలో ఎగురవేసిన కోదండ రాముడని చెప్పారు. పేదవారి వెన్నపూస, తెలుగువారి వెన్నుపూస త‌న తండ్రి అని చెప్పారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు అంకితం ఇస్తూ ఈ శ్రీరామ దండకాన్ని ఆల‌పిస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్‌బీకే ఫిల్మ్స్ యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.