తెలుగులో హీరోగా విజయ్ సేతుపతి!

28-05-2021 Fri 11:44
  • తమిళనాట విపరీతమైన క్రేజ్
  • మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్
  • 'ఉప్పెన' హిట్ తో తెలుగులో పెరిగిన డిమాండ్
  • తెలుగు నేర్చుకుంటున్న విజయ్ సేతుపతి  
Vijay Setupathi as a hero in tollywood
తమిళనాట విజయ్ సేతుపతికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను డిజైన్ చేస్తే   అక్కడివాళ్లు ముందుగా ఆయననే సంప్రదిస్తూ ఉంటారు. ఒక వైపున హీరో పాత్రలను చేస్తూనే .. మరో వైపున విలన్ పాత్రలను చేయడం ఆయనకే సాధ్యమైంది. ఇక తెలుగు నుంచి వచ్చే అవకాశాలను కూడా ఆయన వదులుకోవడం లేదు. ఇటీవల 'ఉప్పెన' సినిమాలో చేసిన విలన్ రోల్ ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

'ఉప్పెన'కి ముందు ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమాతో మరింత చేరువయ్యారు. దాంతో తెలుగు నుంచి కూడా ఆయనకి వరుస అవకాశాలు వెళుతున్నాయట. అలా తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఆయనను సంప్రదించినట్టుగా చెప్పుకుంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా తెలుగులో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఆయనని కలిసి కథ వినిపించారట. ఇప్పటికే తెలుగు నేర్చుకుంటున్న విజయ్ సేతుపతి, ఈ సినిమాకి ఓకే చెప్పవచ్చనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.