తెలంగాణ ప్రజలు మనవైపే చూస్తున్నారు.. అటువైపు కూడా దృష్టి పెట్టండి: చంద్రబాబును కోరిన టీటీడీపీ నేతలు
- టీడీపీ మహానాడులో మాట్లాడిన టీటీడీపీ నేతలు
- బడుగు, బలహీన వర్గాలు మనవైపే చూస్తున్నాయి
- కేసీఆర్ పాలనతో ప్రజలు విసుగెత్తి పోయారు
- పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం
టీడీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు మనవైపే చూస్తున్నారని నేతలు దుర్గాప్రసాద్, జ్యోజిరెడ్డి, కృష్ణమోహన్, అరవింద్ కుమార్ గౌడ్, తాజొద్దీన్ తదితరులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీకి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనదని, పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమని తాజొద్దీన్ పేర్కొన్నారు.