Vijayasai Reddy: టీడీపీకి జూమ్ మహానాడులే మిగిలాయి: విజయసాయిరెడ్డి ఎద్దేవా

TDP has only zoom Mahanadus says Vijayasai Reddy
  • టీడీపీ ఎప్పుడో కనుమరుగైంది
  • చంద్రబాబు కొట్టేసిన పార్టీ ఫినిష్ అయింది
  • బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే టీడీపీ పరిమితమయింది
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. కరోనా కారణంగా ఇది వర్చువల్ గా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కనుమరుగయిందని ఆయన అన్నారు. చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ ఫినిష్ అయిపోయిందని చెప్పారు. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే టీడీపీ పరిమితమయిందని అన్నారు. కుప్పంలోనే టీడీపీ కొట్టుకుపోయిన తర్వాత... అచ్చెన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయని అన్నారు. టీడీపీకి ఇప్పుడు జూమ్ మహానాడులే మిగిలాయని చెప్పారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News