Telangana: యాస్ తుపాను ప్రభావం.. రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు!

  • ఈరోజు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు 
  • ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • అనేక జిల్లాల్లో గాలులతో కూడిన వర్షాలు
Two days rain forecast for Telangana

ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన యాస్ తుపాను... తెలంగాణపై కూడా ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అనేక జిల్లాలలో గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

మరోవైపు రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు ఈరోజు 38 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించింది. జీహెచ్ఎంసీ పరిథిలో ఈ సీజన్ లో నాయయణగూడలో అత్యధికంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

More Telugu News