Karthi: పట్టాలపైనే ఉన్న 'ఖైదీ' సీక్వెల్!

  • కార్తి కెరియర్లో 'ఖైదీ' సూపర్ హిట్
  • సీక్వెల్ ఉండకపోవచ్చనే టాక్
  • క్లారిటీ ఇచ్చిన నిర్మాత
  • 'సర్దార్'తో బిజీగా ఉన్న కార్తి    
Khaidi movie sequel confirmed

తమిళ హీరో కార్తి కెరియర్లో కొన్ని హిట్లు కనిపిస్తాయి .. వాటిలో 'ఖైదీ' స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో .. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఒక పోలీస్ స్టేషన్ సెట్ .. ఒక అనాథ బాలికల హాస్టల్ సెట్ .. సింగిల్ కాస్ట్యూమ్ లో హీరో. ఇంత తక్కువ బడ్జెట్ లో లోకేశ్ కనగరాజ్ చిత్రీకరించిన ఈ సినిమా, తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని కార్తి అభిమానులు భావించారు. సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తి చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. ప్రస్తుతం 'సర్దార్' సినిమా చేస్తున్న కార్తి, ఆ తరువాత 'ఖైదీ' సీక్వెల్ కి రానున్నాడన్న మాట.

More Telugu News