Rahul Gandhi: లక్షద్వీప్ ప్రజలకు అండగా ఉంటా: రాహుల్ గాంధీ

  • అడ్మినిస్ట్రేషన్ అధికారికి వ్యతిరేకంగా లక్షద్వీప్ లో ఆందోళనలు
  • ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించిన రాహుల్
  • అధికారంలో ఉన్న అజ్ఞానులైన వ్యక్తులు లక్షద్వీప్ ను నాశనం చేస్తున్నారని మండిపాటు
Rahul Gandhi On Lakshadweep

కేంద్ర ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేషన్ అధికారికి వ్యతిరేకంగా లక్షద్వీప్ ప్రజలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులుగా అక్కడ ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలను సదరు అధికారి అవలంబిస్తున్నారని... ఆయనను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లక్షద్వీప్ ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. సముద్రంలో భారత్ కు లక్షద్వీప్ ఒక ఆభరణం వంటిదని రాహుల్ చెప్పారు. అధికారంలో ఉన్న అజ్ఞానులైన వ్యక్తులు లక్షద్వీప్ ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షద్వీప్ ప్రజలకు తాను అండగా ఉంటానని చెప్పారు.

More Telugu News