Telangana: పౌరసరఫరాల సంస్థను మోసగించిన బియ్యం వ్యాపారి.. రూ.1.67 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ED Attach about Rs 2 crore assets of Rice Merchant in Telangna
  • బియ్యాన్ని దారి మళ్లించి రూ. 1.95 కోట్ల మేర మోసం
  • అశ్వారావుపేట బియ్యం వ్యాపారికి చెందిన రూ. 1.67 కోట్ల ఆస్తుల సీజ్
  • శ్రీ సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీస్ భాగస్వామి నరసింహారావుపై అభియోగాలు
పౌరసరఫరాల సంస్థను రూ. 1.95 కోట్ల మేర మోసగించిన కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన బియ్యం వ్యాపారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. శ్రీ సాయికృష్ణ రైస్ ఇండస్ట్రీ భాగస్వామి నరసింహారావు బియ్యాన్ని దారి మళ్లించి రూ. 1.95 కోట్ల మేర మోసగించినట్టు అభియోగాలు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో తాజాగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నరసింహారావుకు చెందిన రూ. 1.67 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Telangana
Bhadradri Kothagudem District
Rice merchant

More Telugu News