TTD: టీటీడీ వర్సెస్ కిష్కింద ట్రస్ట్.. హనుమంతుడి జన్మస్థలంపై చర్చ రేపే!

  • అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా ప్రకటించిన టీటీడీ
  • ఖండించిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
  • తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ
TTD Vs Kishkinda Trust  Debate on lord Hanumans birthplace

హనుమంతుడి జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం, కర్ణాటకలోని కిష్కింద ట్రస్ట్ మధ్య నెలకొన్న వివాదానికి రేపటితో ఫుల్‌స్టాప్ పడేలా కనిపిస్తోంది. నాలుగు నెలల అధ్యయనం అనంతరం తిరుమలలోని అంజనాద్రే రామబంటు జన్మస్థలమని తేల్చింది. శ్రీరామ నవమి రోజున ఈ విషయాన్ని ప్రకటించింది.

అయితే, టీటీడీ ప్రకటనను హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీవ్రంగా ఖండిస్తూ టీటీడీకి లేఖ రాసింది. నాలుగు నెలల పరిశోధనతోనే ఎలా నిర్ధారణకు వస్తారంటూ ఆక్షేపించింది. ఈ విషయంలో చర్చకు రావాలంటూ సవాలు విసిరింది. ప్రతిగా టీటీడీ లేఖ రాస్తూ తాము సిద్ధమేనని, ఇప్పుడంటే ఇప్పుడే చర్చకు కూర్చుందామని పేర్కొంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఇరు వర్గాలు చర్చకు సిద్ధమయ్యాయి. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో రేపు (గురువారం) ఇరు పక్షాల మధ్య చర్చ జరగనుంది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొననుండగా, టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటారు.

More Telugu News