Nikhil: నిఖిల్ పుట్టినరోజున '18 పేజెస్' ఫస్టులుక్!

  • బన్నీ వాసు నిర్మాణంలో '18 పేజెస్'
  • కథ .. స్క్రీన్ ప్లే అందించిన సుకుమార్
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
18 Pages first look date fixed

నిఖిల్ హీరోగా బన్నీవాసు నిర్మాణంలో '18 పేజెస్' రూపొందుతోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ కథ - స్క్రీన్ ప్లే అందించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, వాస్తవానికి ఈ పాటికే చిత్రీకరణను పూర్తి చేసుకోవాలి. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.

ఇక ఈ సినిమా ఫస్టులుక్ ను నిఖిల్ పుట్టిన రోజైన జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా వదిలారు. గోపీ సుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమా, తన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిఖిల్ చెబుతూ ఉండటం విశేషం. ఇక కొంత కాలంగా సరైన హిట్ లేక రేస్ లో వెనకబడిపోయిన అనుపమకు కూడా ఈ హిట్ చాలా అవసరం. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే నిఖిల్ 'కార్తికేయ 2' ప్రాజెక్టుపైకి వెళ్లనున్నాడు.

More Telugu News