Mehul Choksi: మెహుల్ చోక్సీ పారిపోయినట్టు ఆధారాలు లేవు: అంటిగ్వా ప్రధాని

  • చోక్సీ అంటిగ్వాలోనే ఎక్కడో ఉండి ఉంటారు
  • సముద్ర, వాయు మార్గాల్లో వెళ్లే అవకాశం లేదు
  • పార్లమెంటుకు తెలిపిన అంటిగ్వా ప్రధాని
Antigua Seeks Interpol Help to Trace Mehul Choksi

భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అంటిగ్వా నుంచి పారిపోయినట్టు వస్తున్న వార్తలను ఆ దేశ ప్రధాని గాస్టన్ బ్రౌనీ ఖండించారు. చోక్సీ దేశం విడిచి పారిపోయినట్టు వస్తున్న వార్తలు నిజం కాదని కొట్టిపడేశారు. ఆదివారం సాయంత్రం డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన చోక్సీ ఆ తర్వాత మాయమయ్యాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది.

చోక్సీ పరారీ విషయమై ప్రధాని బ్రౌనీ పార్లమెంటులో మాట్లాడుతూ.. చోక్సీ క్యూబాకు పారిపోయినట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. దేశంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో విమానం ద్వారా పారిపోయే అవకాశం లేదని, సముద్ర మార్గం ద్వారా వెళ్లి ఉంటే ఆ విషయం ఇప్పటికే తమకు తెలిసి ఉండేదని వివరించారు. కాబట్టి చోక్సీ ఇక్కడే ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. చోక్సీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News