Uttarakhand: యోగాగురు రామ్‌దేవ్ బాబాకు రూ.1,000 కోట్ల పరువునష్టం దావా నోటీసులు!

IMA Uttarakhand sends a defamation notice of Rs 1000 cr to Yog Guru Ramdev
  • అల్లోపతిని కించపరిచేలా యోగాగురు వ్యాఖ్య‌లు
  • క్ష‌మాప‌ణ చెప్పాల‌ని  ఉత్తరాఖండ్‌ వైద్య సంఘం నోటీసులు
  • 15 రోజులలో స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్
అల్లోపతి వైద్య విధానాన్ని కించపరిచేలా యోగాగురు రాందేవ్ బాబా వ్యాఖ్యలు చేశారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై రామ్‌దేవ్ బాబా వివ‌ర‌ణ ఇస్తూ మ‌రో ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని వైద్యుల సంఘం అభిప్రాయపడింది.

ఈ క్రమంలో, ఈ రోజు ఐఎంఏకు చెందిన‌ ఉత్తరాఖండ్‌ వైద్య సంఘం రామ్‌దేవ్ బాబాకు  రూ. వెయ్యి కోట్ల పరువునష్టం నోటీసులు ఇచ్చింది. రామ్‌దేవ్ తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై 15 రోజుల్లోగా వీడియో రూపంలో స‌మాధానం చెప్పాలని, అలాగే, రాత‌పూర్వ‌కంగా క్షమాపణలను చెప్పాలని, లేకపోతే రూ.1000 కోట్ల పరువునష్టం కోరుతూ దావా వేయడం జరుగుతుందని స్ప‌ష్టం చేసింది.
Uttarakhand
Baba Ramdev

More Telugu News