Tollywood: ‘అనుకోని అతిథి’ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ కన్నుమూత

producer annam reddy krishna kumar passes away
  • రెండు రోజుల్లో విడుదల కానున్న ‘అనుకోని అతిథి’
  • వైజాగ్‌లో గుండెపోటుతో కన్నుమూత
  • టాలీవుడ్ లో వరుస విషాదాలు 
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుజామున విశాఖపట్టణంలో గుండెపోటుతో కన్నుమూశారు. అన్నంరెడ్డి తాజాగా నిర్మించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ నటించారు.

 అన్నంరెడ్డి మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. టాలీవుడ్‌లో ఇటీవల వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. ప్రముఖ గాయకుడు జి.ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్‌జీ, రచయిత, దర్శకుడు నంద్యాల రవి, నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజు కన్నుమూశారు.
Tollywood
Annam Reddy Krishna Kumar
Heart Attack

More Telugu News