సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ 
  • అందుకే కీర్తి సురేశ్ చెల్లి పాత్ర చేస్తోందట!
  • మాస్ పాటకి ఖరారైన బాలీవుడ్ భామ    
Kajal Agarwal trained in martial arts

*  కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ మూవీలో కాజల్ 'రా' ఏజెంట్ గా నటిస్తోంది. ఇందులో ఆమెకు యాక్షన్ దృశ్యాలు కూడా ఉంటాయట. దాంతో ఆమె మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు పొందుతున్నట్టు చెబుతున్నారు.
*  స్టార్ హీరోల సరసన కథానాయికగా నటిస్తున్న కీర్తి సురేశ్ మరోపక్క 'అన్నాత్తే'లో  రజనీకాంత్ కి చెల్లెలుగా నటిస్తోంది. ఇదే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఇందులో ఆమెది చెల్లెలు పాత్ర అయినప్పటికీ, కథను మలుపుతిప్పే కీలక పాత్ర కావడం వల్లనే ఆమె ఒప్పుకుందట. ఈ పాత్ర మంచి పేరుతెస్తుందన్న నమ్మకంతో ఆమె వుంది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రెండో భాగంలో ఒక స్పెషల్ మాసీ డ్యాన్స్ నెంబర్ ఉందట. ఈ పాటలో బన్నీ సరసన డ్యాన్స్ చేయడానికి బాలీవుడ్ భామ దిశా పఠానీని ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.

More Telugu News