KCR: కాళేశ్వరంతో వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోయింది: సీఎం కేసీఆర్

  • నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
  • లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలని ఆదేశం
  • దేవాదుల ప్రాజెక్టు వరంగల్ జిల్లాకు అంకితం చేస్తామని వెల్లడి
  • కాళేశ్వరంతో రెండు పంటలు పండిస్తున్నామన్న కేసీఆర్
CM KCR review meeting on irrigation

రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేవరకొండ నుంచి కోదాడ వరకు నిర్మించే లిఫ్ట్ పథకాలకు టెండర్లు పిలవాలని, జూన్ 15 లోపు అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. నెల్లికల్ లో 15 లిఫ్ట్ ప్రాజెక్టులకు అంచనాలు రూపొందించాలని నిర్దేశించారు. అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. కాగజ్ నగర్, బెల్లంపల్లి లిఫ్ట్ ఆయకట్టుకు సర్వే చేయాలని అన్నారు. దేవాదుల ప్రాజెక్టును వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామని చెప్పారు. కాల్వల మరమ్మతుల కోసం రూ.700 కోట్లు కేటాయించామని తెలిపారు. జూన్ 30 నాటికి మొదటి దశ చెక్ డ్యాములు పూర్తిచేయాలని ఆదేశించారు.  

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ వ్యవసాయ రంగ ముఖచిత్రమే మారిపోయిందని అన్నారు. కాళేశ్వరంతోనే 35 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నామని తెలిపారు. నదీ గర్భంలోనే 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే స్థాయికి చేరామని పేర్కొన్నారు.

More Telugu News