మహానాడు నిర్వహణపై టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

25-05-2021 Tue 20:44
  • రెండ్రోజుల పాటు టీడీపీ మహానాడు
  • ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు
  • ఈసారి కూడా ఆన్ లైన్ లోనే నిర్వహణ
  • తీర్మానాలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
Chandrababu held meeting with TDP leaders ahead of Mahanadu

త్వరలో మహానాడు నిర్వహించడంపై టీడీపీ అధినాయకత్వం పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు కోరుతోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ మహానాడులో పలు తీర్మానాలు చేయనున్నారు.

కాగా, గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మహానాడు ఆన్ లైన్ లోనే నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ మహానాడు ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే అవకాశాలున్నాయి. ప్రతి ఏడాది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి (మే 28) కలిసొచ్చేలా మహానాడు జరపడం తెలిసిందే.