Venkatesh Daggubati: 'దృశ్యం 2' విడుదల విషయంలో వెంకటేశ్ అభిప్రాయం అదేనట!

Drushyam 2 will be released in OTT
  • 'అసురన్' రీమేక్ గా 'నారప్ప'
  • 'దృశ్యం 2' రీమేక్ అదే టైటిల్ తో
  • ఓటీటీ దిశగా 'దృశ్యం 2'
కథల ఎంపిక విషయంలో .. ఆ సినిమాల విడుదల విషయంలో వెంకటేశ్ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముందుగా అనుకున్న ప్రకారమే తన సినిమాల షూటింగులు పూర్తయ్యేలా చూసుకుంటూ ఉంటారు. కెరియర్ ఆరంభం నుంచి ఇప్పటికీ ఆయన అదే జోరును చూపుతున్నారు. ఆయన సినిమాలు రెండు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి 'నారప్ప' అయితే మరొకటి 'దృశ్యం 2'. తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' సినిమాను, తెలుగులో 'నారప్ప' టైటిల్ తో రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఇక మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'దృశ్యం 2' రీమేక్ ను ఆ టైటిల్ తోనే రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో వెంకటేశ్ ఉన్నారట. మరి సురేశ్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Venkatesh Daggubati
Meena
Drushyam 2

More Telugu News