Chiranjeevi: చిరూ నిర్ణయం ప్రకారమే చరణ్ పాత్ర ముగింపు?

Acharya movie update
  • ముగింపు దశలో 'ఆచార్య'
  • సిద్ధా పాత్రపై ఊహాగానాలు
  • ప్రత్యేక ఆకర్షణగా మణిశర్మ సంగీతం
  • త్వరలోనే కొత్త రిలీజ్ డేట్      
చిరంజీవి .. కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో 'సిద్ధా 'అనే పవర్ఫుల్ పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఉద్యమ బాటలో ఉరకలేసే ఈ పాత్ర, ఆశయసాధన కోసం ప్రాణాలను అర్పిస్తుందట. ఈ ఎమోషనల్ సీన్ ను తెరపై చూపించాలని కొరటాల అనుకుంటే, అందుకు చిరంజీవి నిరాకరించారనే ఒక టాక్ వినిపిస్తోంది. 'సిద్ధా' పాత్ర చనిపోవడాన్ని తెరపై చూపించడం వలన, ఆడియన్స్ వేరే మూడ్ లోకి వెళ్లిపోతారనీ, అందువలన ఆ పాత్ర ముగింపు సున్నితంగానే ఉండాలనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారని అంటున్నారు.

చిరంజీవి చేసిన సూచన ప్రకారమే, ఆడియన్స్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా 'సిద్ధా' పాత్ర ముగింపును కొరటాల చిత్రీకరించాడని చెబుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటిస్తుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఒకే తెరపై చిరూ .. చరణ్ లను చూసే సమయం కోసం మెగా అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Chiranjeevi
Kajal Agarwal
Charan
Pooja Hegde

More Telugu News