Suhana Khan: నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నా... మీ కూతురు సుహానాతో పెళ్లి చేయండి: షారుఖ్ భార్యకు నెటిజన్ ప్రతిపాదన

Social media user wants to marry Sharukh Khan daughter Suhana
  • మే 22న సుహానా ఖాన్ పుట్టినరోజు
  • విషెస్ తెలిపిన తల్లి గౌరీఖాన్
  • ఆసక్తికర వ్యాఖ్య చేసిన నెటిజన్
  • మీ అల్లుడిగా చేసుకోవాలంటూ విజ్ఞప్తి
  • నెట్టింట సందడి చేస్తున్న కామెంట్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఇంకా సినీ రంగప్రవేశం చేయకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే ఉంది. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సుహానా పుట్టినరోజు (మే 22) సందర్భంగా ఆమె తల్లి గౌరీ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరీఖాన్ పోస్టుకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది.

అయితే వాటిలో ఓ కామెంట్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. తాను బాగానే సంపాదిస్తున్నానని, తనను అల్లుడిగా చేసుకోవాలంటూ సుహైబ్ అనే నెటిజన్ గౌరీఖాన్ ను కోరాడు. "గౌరీ మేడమ్... సుహానాతో నా పెళ్లి చేయండి... నా నెలజీతం లక్షకు పైనే ఉంటుంది" అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట సందడి చేస్తోంది.
Suhana Khan
Gauri Khan
Marriage
Sharukh Khan
Bollywood

More Telugu News