Sensex: ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 11 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • నష్టాలను మూటగట్టుకున్న బ్యాంకింగ్ స్టాకులు
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివర్లో మళ్లీ కొంత పుంజుకుని ఫ్లాట్ గా ముగిశాయి.

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ను దాదాపు 80 బేసిస్ పాయింట్ల వరకు బార్క్లేస్ కట్ చేయడం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 50,637 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 11 పాయింట్లు లాభపడి 15,208 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.48%) టైటాన్ కంపెనీ (3.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.87%), ఇన్ఫోసిస్ (1.21%), టెక్ మహీంద్రా (0.98%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.94%), యాక్సిస్ బ్యాంక్ (-1.15%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.04%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.82%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.34%).

More Telugu News