Balakrishna: 'అఖండ' ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

Balakrishna fans are waiting for first single from Akhanda movie
  • బాలయ్యతో బోయపాటి మూడో సినిమా
  • ముగింపు దశలో చిత్రీకరణ
  • సంగీత దర్శకుడిగా తమన్
  • ఈ నెల 28 కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'అఖండ'పైనే ఉంది. ఆయన బోయపాటితో చేసిన రెండు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడం ఒక కారణమైతే, ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించనుండటం మరో కారణం. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ తో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నిజానికి ఈ సినిమాను ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అనుకున్న సమయానికి షూటింగ్ చేయడం వీలుపడలేదు. దాంతో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ సింగిల్ ను వదిలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిమానులు భావించారు. కానీ ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అసహనానికి లోనవుతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ సింగిల్ వదులుతారా .. లేదా? అనేది వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న.
Balakrishna
Boyapati Sreenu
Pragya Jaiswal
Poorna

More Telugu News