Sushil Kumar: రెజ్లర్ సుశీల్‌ కుమార్‌పై వేటుకు రైల్వే బోర్డు నిర్ణయం

  • సాగర్ రాణా హత్యకేసులో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్
  • ఉత్తర రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా విధులు
  • ఢిల్లీ ప్రభుత్వం నుంచి రైల్వే బోర్డుకు అందిన నివేదిక
  • ఒకటి రెండు రోజుల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు!
Railways set to suspend wrestler Sushil Kumar

జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్యకేసులో అరెస్ట్ అయిన దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై వేటుకు రైల్వే సిద్ధమైంది. నార్తరన్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్‌గా ఉన్న సుశీల్‌ కుమార్‌ను 2015లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ది కోసం ఛత్రసాల స్టేడియంకు ఓఎస్‌డీగా పంపింది. గతేడాదితో డిప్యుటేషన్ ముగియడంతో పొడిగించాలని సుశీల్ చేసిన విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో త్వరలోనే వెనక్కి వెళ్లి రైల్వేలో చేరాల్సి ఉంది.

అంతలోనే సాగర్ రాణా హత్యకేసులో సుశీల్ అరెస్ట్ అయ్యాడు. రాణా హత్య కేసుకు సంబంధించిన నివేదిక ఆదివారం రైల్వే బోర్డుకు అందింది. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో రైల్వే విధుల నుంచి అతడిని సస్పెండ్ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు రోజుల్లో సుశీల్ సస్పెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాణా హత్య తర్వాత పరారీలో ఉన్న సుశీల్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.

More Telugu News