ముఖేశ్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం జగన్

24-05-2021 Mon 22:12
  • ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
  • అంబానీ సహకారానికి ధన్యవాదాలు అంటూ జగన్ ట్వీట్
  • మద్దతు ఇకపైనా కొనసాగాలని ఆకాంక్ష
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం
AP CM Jagan thanked Mukesh Ambani and Reliance Foundation

రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేశ్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముఖేశ్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ పై పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు సాయపడుతున్నారంటూ కొనియాడారు.

రాష్ట్రానికి మీ మద్దతు ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆక్సిజన్ కు డిమాండ్ కూడా తీవ్రస్థాయిలో ఉంది. దాంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీ ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ రైళ్లు ఏపీకి రావడం ఊరట కలిగించే విషయం.