janvi Kapoor: రంగంలోకి దిగుతున్న ఖుషీ కపూర్!

TollyWood entry in Sridevi Daughters
  • బాలీవుడ్ లో ఎదుగుతున్న జాన్వీ కపూర్
  • నటనలో శిక్షణ పూర్తి చేసిన ఖుషీ కపూర్
  • త్వరలో వెండితెరకి పరిచయం దిశగా పనులు  

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. ఇంకా తనని తాను మార్చుకుంటూ .. మలుచుకుంటూ మరో మెట్టు ఎదగడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో తాను రూపొందించనున్న సినిమా ద్వారా జాన్వీ కపూర్ ను పరిచయం చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన జాన్వీ కపూర్ ను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ను కూడా రంగంలోకి దింపడానికి బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ తీసుకోవడం పూర్తయిందట. దాంతో ఆమెను కూడా వెండితెరకి పరిచయం చేయడానికి బోనీ కపూర్ సిద్ధమవుతున్నారట. ముందుగా బాలీవుడ్ కి ఆయన ప్రాధాన్యతను ఇచ్చాడట. కుదరకపోతే కోలీవుడ్ .. టాలీవుడ్ సినిమాలతోను ఆమెను పరిచయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ముందుగా ఎవరు టాలీవుడ్ కి పరిచయం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News