చార్టర్డ్ విమానంలో పెళ్లి... కరోనా మార్గదర్శకాలకు తిలోదకాలు!
- వినూత్నంగా విమానంలో పెళ్లి
- మధురై నుంచి బెంగళూరు వెళుతూ మాంగల్యధారణ
- అతిథులతో క్రిక్కిరిసిన స్పైస్ జెట్ విమానం
- మాస్కుల్లేకుండానే కనిపించిన జనాలు
- విచారణకు ఆదేశించిన డీజీసీఏ
అయితే, కరోనా వేళ జరిగిన ఈ పెళ్లిలో కరోనా మార్గదర్శకాల అమలు ఎక్కడా కనిపించలేదు. విమానంలో అతిథులు క్రిక్కిరిసి ఉండగా, వధూవరులకు మాస్కుల్లేకుండానే మాంగల్యధారణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.
కరోనా నిబంధనలు పాటించకుండా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ స్పైస్ జెట్, ఎయిర్ పోర్ట్ వర్గాలను ఆదేశించింది. ఆ విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.