Prathipati Pulla Rao: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యపై హైదరాబాదులో కేసు నమోదు

Case filed against Prathipati Pulla Rao wife
  • స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు
  • దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పీఎస్ పోలీసులు
  • గత కొంత కాలంగా కొనసాగుతున్న వివాదం
టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మపై హైదరాబాదులో కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలతో ఆమెపై జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సర్వేనంబర్ 853ఎఫ్ కు చెందిన 1519 గజాల స్థలంపై కొంత కాలంగా వివాదం జరుగుతోంది. ఆ స్థలం తమదేనంటూ ప్రత్తిపాటి పుల్లారావు భార్య వాదిస్తున్నారు. ఆ స్థలంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి చెందిన బోర్డును కూడా తొలగించారు.

ఆ సైట్ లోకి ప్రవేశించి నానా హంగామా చేశారంటూ నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ, స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకాయమ్మ, ఆమె అనుచరులు ప్రయత్నిస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొంది. ఆ స్థలం తమదేనని, తాము కొనుగోలు చేశామని ఆమె చెపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Prathipati Pulla Rao
Wife
Case
Jubilee Hills Housing Society
Telugudesam

More Telugu News