Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ కజిన్ సోమశేఖర్ కరోనాతో మృతి

Ram Gopal Varmas brother dies with corona
  • పలు సినిమాలకు వర్మతో కలిసి పని చేసిన సోమశేఖర్
  • సోమశేఖర్ తనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని గతంలో చెప్పిన వర్మ
  • శేఖర్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేసిన బోనీ కపూర్
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వరుసకు సోదరుడైన సోమశేఖర్ కరోనా బారిన పడి కన్నుమూశారు. పలు సినిమాలకు వర్మతో కలిసి సోమశేఖర్ పని చేశారు. వర్మ నిర్మించిన ఎన్నో సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలను చూసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో... వర్మకు దూరంగా ఉంటున్నారు. ఓ హిందీ చిత్రానికి ఆయన దర్శకుడిగా కూడా పని చేశారు.

సోమశేఖర్ గురించి వర్మ ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. తన జీవితంలో సోమశేఖర్ ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని... ఆయనను తాను ఎంతో మిస్ అవుతున్నానని వర్మ చెప్పారు. హీరో జేడీ చక్రవర్తి కూడా  ఓ ఇంటర్వ్యూలో సోమశేఖర్ గురించి మాట్లాడుతూ... వర్మ కంటే శేఖర్ ను చూస్తే తనకు ఎక్కువ భయం వేసేదని చెప్పాడు.

సోమశేఖర్ మృతి పట్ల బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందిస్తూ... తన తల్లి విషయంలో శేఖర్ ఎంతో జాగ్రత్త తీసుకునేవారని చెప్పారు. కరోనా సోకిన తర్వాత కూడా తల్లి గురించి తపించేవాడని తెలిపారు. తన తల్లిని కాపాడుకోగలిగాడే కానీ... తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Ram Gopal Varma
Brother
Soma Sekhar
Corona Virus

More Telugu News