Prakasam District: బ్లాక్‌ఫంగస్‌తో ఏపీలో ముగ్గురి మృతి.. ప్రకాశంలో చెలరేగుతున్న వ్యాధి

  • ప్రకాశం జిల్లాలో 36 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
  • 20 మందికి ఒంగోలులో చికిత్స
  • నలుగురికి అత్యవసర వైద్యం అవసరం
  • ఆపరేషన్ కోసం విజయవాడ, హైదరాబాద్‌కు తరలింపు
3 died with black fungus in Andhrapradesh

ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారినపడిన ముగ్గురు నిన్న ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు గుంటూరు జిల్లా వారు కాగా, ఒకరు కర్నూలుకు చెందిన వారు. వీరందరూ కరోనా నుంచి కోలుకున్న వారే కావడం గమనార్హం. మరోవైపు, ప్రకాశంలో ఈ ఫంగస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 36 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వీరిలో 20 మంది ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురికి అత్యవసర ఆపరేషన్ అవసరం కావడంతో విజయవాడ, హైదరాబాద్ తరలించారు.

ఇక కర్నూలు జిల్లా నాగులాపురానికి చెందిన కేవీ ప్రసాద్ (68) ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన చింతా వెంకటేశ్వరరావు (64) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు.  అలాగే, గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కట్టా సాంబయ్య (55) వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

More Telugu News