Shahid Afridi: కుమార్తె పెళ్లిపై వివరణ ఇచ్చిన పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది

Shahid Afridi clarifies about his daughter marriage
  • షాహిద్ అఫ్రిదీ అల్లుడిగా రానున్న షహీన్ అఫ్రిదీ
  • అక్సా పెళ్లి చేయాలని నిర్ణయించిన షాహిద్ అఫ్రిదీ
  • ప్రస్తుతం వైద్య విద్య అభ్యసిస్తున్న అక్సా
  • షహీన్, అక్సాలకు గతంలో లవ్ అఫైర్ లేదన్న షాహిద్ అఫ్రిదీ
పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిదీ కుమార్తె అక్సా త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పరిణయమాడబోతోంది ఎవరినో కాదు... ప్రస్తుతం పాక్ జట్టులో ప్రధాన పేసర్ గా వెలుగొందుతున్న ఆరడుగుల పొడగరి షహీన్ అఫ్రిదీని. అయితే, వీరి వివాహంపై షాహిద్ అఫ్రిదీ తొలిసారి స్పందించాడు. తన కుమార్తె పెళ్లి షహీన్ అఫ్రిదీతో జరగనున్న విషయం వాస్తవమేనని నిర్ధారించాడు. అయితే, అక్సా, షహీన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు.

వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, షహీన్ తండ్రి స్వయంగా తన ఇంటికి వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారని అఫ్రిదీ వెల్లడించాడు. ప్రస్తుతం అక్సా వైద్య విద్య అభ్యసిస్తోందని, అటు షహీన్ కూడా కెరీర్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడని, ఈ నేపథ్యంలో పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చని, వారిద్దరూ తమ కెరీర్లలో బాగా స్థిరపడ్డాకే పెళ్లి జరుగుతుందని అఫ్రిదీ స్పష్టం చేశాడు. ఈ పెళ్లికి ఇరువైపులా పెద్దలు అంగీకరించారని తెలిపాడు.
Shahid Afridi
Shaheen Shah Afridi
Aqsa Afridi
Marriage
Pakistan

More Telugu News