Positivity Rate: ఏపీలో కొత్తగా 18,767 మందికి కరోనా పాజిటివ్

  • తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు
  • 11 జిల్లాల్లో 2 వేలకు లోపే కొత్త కేసులు
  • 4 జిల్లాల్లో వెయ్యి లోపే కేసులు నమోదు
  • మరణాలు మాత్రం 100కు పైనే!
  • గత 24 గంటల్లో 104 మంది మృతి
Positivity rate slowly declines in AP

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీపై కొద్దిమేర నిదానించింది. గడచిన 24 గంటల్లో 91,629 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,767 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,887 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,323 కేసులు గుర్తించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 2 వేలకు లోపే కొత్త కేసులు వచ్చాయి. అందునా, నాలుగు జిల్లాల్లో వెయ్యి లోపే కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 20,109 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15,80,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 13,61,464 మంది కోలుకున్నారు. ఇంకా 2,09,237 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 10,126కి పెరిగింది.

More Telugu News