V Srinivas Goud: కేసీఆర్ కరోనా రోగులను పరామర్శించడంపై విమర్శలు సరికాదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • ఇటీవల సీఎం కేసీఆర్ ఆసుపత్రుల సందర్శన
  • ప్రతిపక్షాల వ్యంగ్యోక్తులు, విమర్శలు
  • రాజకీయాలకు ఇది సమయం కాదన్న శ్రీనివాస్ గౌడ్
  • కరోనా కట్టడిలో విపక్షాలు కలిసి రావాలని పిలుపు
Srinivas Goud hits out opposition parties

ఇటీవల సీఎం కేసీఆర్ వరుసగా గాంధీ ఆసుపత్రి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులను సందర్శించడం, దానిపై విపక్షాలు సెటైర్లు, విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్ష నేతల తీరుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కరోనా రోగులను పరామర్శించడంపై విమర్శలు చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.

రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడమే అందరి ముందు ఉన్న తక్షణ కర్తవ్యం అని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. కొవిడ్ కట్టడి కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.

అంత్యక్రియల నిమిత్తం మరో నెలరోజుల్లో గ్యాస్ ఆధారిత శ్మశానవాటికను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. కేవలం రూ.5కే దహన సంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. సమాచారం అందిస్తే మున్సిపల్ అధికారులే దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తారని వివరించారు.

More Telugu News