Vizag Steel Plant: విశాఖ ఉక్కు దీక్షా శిబిరానికి మంటలు.. అనుమానం వ్యక్తం చేస్తున్న పోరాట సమితి నేతలు

 Fire accident at Visakhapatnam Steel Initiation Camp
  • వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం
  • జీవీఎంసీ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం
  • కావాలనే చేశారంటున్న ఉద్యమ నేతలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమకారులు చేపట్టిన ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన దీక్షా శిబరంలో అగ్నిప్రమాదం సంభవించింది. జీవీఎంసీ కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. ఆ వైపు నుంచి వెళ్తున్న వాకర్స్ మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేశారు.

అగ్నిప్రమాదంపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. శిబిరం వద్ద షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశమే  లేదని, ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈపని చేసి ఉంటారని ఆరోపించారు.
Vizag Steel Plant
Fire Accident
Visakhapatnam

More Telugu News