Etela Rajender: ఈట‌ల రాజేందర్ కుమారుడిపై ఓ యువ‌కుడి ఫిర్యాదు.. వెంట‌నే విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

complaint against nitin reddy
  • మేడ్చల్  లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్ ఫిర్యాదు
  • సీఎంకు లేఖ రాసిన యువ‌కుడు
  • దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్న‌  కేసీఆర్  
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడ‌ని ఓ యువ‌కుడు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు  మేడ్చల్ లోని రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేశ్‌ అనే యువ‌కుడు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో దీనిపై కేసీఆర్ వెంట‌నే స్పందిస్తూ అవినీతి నిరోధ‌క శాఖ‌ విజిలెన్స్, రెవెన్యూ శాఖ దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని  కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణ‌లో ఈటల రాజేంద‌ర్ భూకబ్జా వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆయ‌నకు సంబంధించిన భూముల‌పై కొన్ని  రోజులుగా అధికారులు విచారణ జ‌రుపుతున్నారు. ఇప్పుడు ఆయ‌న కుమారుడు కూడా భూ క‌బ్జాకు పాల్ప‌డ్డాడ‌ని ఫిర్యాదు రావ‌డం గ‌మ‌నార్హం.

Etela Rajender
TRS
Telangana

More Telugu News