మరో కరోనా వైరస్ ముప్పు.. శునకాల ద్వారా మానవుల్లోకి చొరబాటు!
- మలేసియాలో వెలుగుచూసిన వైరస్
- కొత్త వైరస్‌కు ‘సీసీవోవీ-హెచ్‌యూపీఎన్-2018’ అని పేరు
- సార్స్ కోవ్-2 తర్వాత మానవుల్లోకి వచ్చిన తొలి వైరస్
2017-18 మధ్య న్యూమోనియా బారినపడిన కొందరు బాధితుల నమూనాలను విశ్లేషించగా ఈ వైరస్ వెలుగుచూసినట్టు చెప్పారు. శునకాల్లోని కరోనా వైరస్‌ను మనుషుల్లో గుర్తించడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మానవుల నుంచి మానవులకు సోకుతుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి వైరస్లు రాత్రికి రాత్రే మహమ్మారిగా మారబోవని స్పష్టం చేశారు. తొలుత మనుషుల శరీరంలోని రోగ నిరోధకశక్తికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాయని, ఈ క్రమంలో ఇన్ఫెక్షన్ కలిగించడానికి ఎన్నో ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.