భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియో వైరల్.. భర్త ఆత్మహత్య
- కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘటన
- వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి వైరల్ చేసిన నిందితుడు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
- దర్యాప్తు జరుపుతుండగా వివాహిత భర్త ఆత్మహత్య
తన భర్త ఆత్మహత్యకు జయబాబే కారణమని, ఇప్పుడు తమ కుటుంబం దిక్కులేనది అయిపోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. మరోవైపు, పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలి భర్తను చంపేస్తానని జయబాబు బెదిరించాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.