AP BJP: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి వీడియో ప్రసంగాన్ని పోస్ట్ చేసి, విమర్శలు గుప్పించిన ఏపీ బీజేపీ

AP BJP shares a video of APPSC member
  • ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీ వుడ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
  • క్రీస్తు జెండా సాయంతో ఎన్నికల్లో పోరాడతామన్న సోనీ వుడ్
  • గుర్రం ఆత్మను దేవుడు తనకిచ్చాడని వెల్లడి
  • ఫలితాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్న ఏపీ బీజేపీ

ఏపీ బీజేపీ విభాగం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది. సీఎం జగన్ ఇటీవలే నియమించిన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నూతలపాటి సోనీ వుడ్ రాబోయే ఎన్నికల్లో క్రీస్తు, యెహోవా నిస్సీ జెండాలు పట్టుకుని పోరాడబోతున్నామని చెప్పడం ఆ వీడియోలో చూడొచ్చు.

యుద్ధం పట్ల ఉత్సాహం చూపే గుర్రం ఆత్మను దేవుడు తనకు ఇచ్చాడని, అలాంటి ఆత్మ కలిగివున్న వాళ్లు తనతో కలిసి నడవాలని సోనీవుడ్ పిలుపునిచ్చారు. దీనిపై ఏపీ బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. "మీరు చెప్పినట్టుగానే 2024 ఎన్నికలు రాముడికి, క్రీస్తుకు మధ్యనే జరగనివ్వండి... ఫలితాన్ని ఏపీ ప్రజలే నిర్ణయిస్తారు" అని పేర్కొంది.

  • Loading...

More Telugu News