Kumar Hegde: కంగనా రనౌత్ బాడీగార్డుపై అత్యాచార ఆరోపణలు... కేసు నమోదు

Rape allegations on Kangana Ranut bodyguard Kumar Hegde
  • చిక్కుల్లో కంగనా బాడీగార్డు కుమార్ హెగ్డే
  • కుమార్ పై ఫిర్యాదు చేసిన బ్యూటీషియన్
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపణ
  • ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబయి పోలీసులు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డు కుమార్ హెగ్డే చిక్కుల్లో పడ్డాడు. కుమార్ పై ఓ బ్యూటీషియన్ అత్యాచార ఆరోపణలు చేసింది. బ్యూటీషియన్ ఫిర్యాదును స్వీకరించిన ముంబయిలోని డీఎన్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జూన్ లో కుమార్ హెగ్డే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆ 30 ఏళ్ల బ్యూటీషియన్ తన ఫిర్యాదులో పేర్కొంది.

కంగనా బాడీగార్డు కుమార్ హెగ్డే, సదరు బ్యూటీషియన్ గత 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే, శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేసేవాడని, అందుకు నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బ్యూటీషియన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
Kumar Hegde
Kangana Ranaut
Rape Allegations
Beautician
Mumbai
Bollywood

More Telugu News