బాలయ్య నాయికగా తెరపైకి త్రిష పేరు!

22-05-2021 Sat 18:10
  • స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన త్రిష
  • తెలుగులో తగ్గిన అవకాశాలు
  • తమిళంలో వరుస ప్రాజెక్టులు  

Balakrishna next movie heroine Trisha

వెండితెరపై చిలిపి చూపులకు .. కొంటె నవ్వులకు త్రిష కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. తెలుగులో పెద్దగా కష్టపడకుండానే ఆమె స్టార్ హీరోయిన్ స్థానాన్ని దక్కించుకుంది. ఒకానొక దశలో ఆమె వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసింది .. యూత్ నుంచి ఒక రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. యువ కథానాయకులతోనే కాదు .. సీనియర్ స్టార్ హీరోల జోడీగా కూడా భారీ విజయాలను అందుకుంది. అలాంటి త్రిషకి ఆ తరువాత అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తెలుగు తెరపై ఆమె కనిపించక నాలుగేళ్లకు పైగా అవుతోంది.

అలాంటి త్రిష పేరు ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ఆమెను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. అయితే తెలుగులో సినిమాలు చేయకపోయినా, తమిళంలో త్రిష బిజీగానే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు .. ఒక మలయాళ మూవీ ఉన్నాయి. పైగా ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే ఆమె ఎక్కువగా చేస్తోంది. ఇక ఇక్కడ ఆమెకి మునుపటి క్రేజ్ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవమెంతన్నది చూడాలి.