GVL Narasimha Rao: ఇది ఏపీ పట్ల కేంద్రం ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనం: జీవీఎల్

  • కరోనా నియంత్రణకు కేంద్రం కృషి చేస్తోందన్న జీవీఎల్
  • 34,040 వెంటిలేటర్లు కేటాయించినట్టు వెల్లడి
  • ఏపీకి 4,960 వెంటిలేటర్లు ఇచ్చినట్టు వివరణ
  • దేశం మొత్తమ్మీద 7వ వంతు అని వ్యాఖ్యలు
GVL opines on ventilators allocation to AP

కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పీఎం కేర్స్ నిధుల్లో భాగంగా ఏప్రిల్ 6 నాటికి రాష్ట్రాలకు 34,040 వెంటిలేటర్లను కేటాయించిందని వెల్లడించారు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 4,960 వెంటిలేటర్లు ఇవ్వడం జరిగిందని జీవీఎల్ వివరించారు. దేశం మొత్తమ్మీద 7వ వంతు కేటాయించారని, ఏపీపై కేంద్రానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ మేరకు వెంటిలేటర్ల కేటాయింపు జాబితాను కూడా జీవీఎల్ పంచుకున్నారు. ఇందులో, ఏపీ తర్వాత మహారాష్ట్రకు అత్యధికంగా 4,434, యూపీకి 4,016 వెంటిలేటర్లు కేటాయించారు.

More Telugu News