IMA: కరోనా సెకండ్ వేవ్ లో 420 మంది డాక్టర్లు చనిపోయారు: ఐఎంఏ

  • డాక్టర్ల పాలిట కరోనా మృత్యుఘంటికలు
  • ప్రాణాపాయ పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులు
  • ఒక్క ఢిల్లీలోనే 100 మంది డాక్టర్లు కరోనాకు బలి
  • తెలంగాణలో 20 మంది వైద్యుల మృత్యువాత
IMA says hundreds of doctors died of covid

కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు ఎంతటి ప్రాణాపాయ పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు 420 మంది డాక్టర్లు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ వివరించింది. అత్యధికంగా బీహార్ లో 96, ఉత్తరప్రదేశ్ లో 41, గుజరాత్ లో 31 మంది, తెలంగాణలోనూ 20 మంది, పశ్చిమ బెంగాల్ లో 16, ఒడిశాలో 16, మహారాష్ట్రలో 15 మంది డాక్టర్లు కన్నుమూశారని పేర్కొంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక చనిపోయిన డాక్టర్ల సంఖ్య 748కి పెరిగినట్టు ఐఎంఏ తెలిపింది.

More Telugu News