Madhu Priya: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ

Singer Madhu Priya files complaint against blank calls
  • మధుప్రియకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్
  • షీటీమ్స్ కు ఫిర్యాదు చేసిన మధుప్రియ
  • కేసు బుక్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
టాలీవుడ్ సింగర్ మధుప్రియ తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ సుపరిచితమే. బిగ్ బాస్ లో కూడా పాల్గొన్న మధు అందరికీ బాగా చేరువైంది. తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

తనకు బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ షీటీమ్స్ కు ఆమె ఫిర్యాదు మెయిల్ ద్వారా చేయగా... వారు ఆమె ఫిర్యాదును సైబర్ క్రైమ్ కు బదిలీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో మధుప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. మధుప్రియ ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 509, 354 బీ సెక్షన్ ల కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Madhu Priya

More Telugu News