Balakrishna: బీఏ రాజు లేరనే వార్త కలచివేసింది: బాలకృష్ణ

The news of BA Raju was shocking says Balakrishna
  • రాజుతో తనకు మంచి అనుబంధం ఉందన్న బాలయ్య
  • ఎంతో బాధను కలిగిస్తోందన్న ప్రకాశ్ రాజ్
  • రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారన్న విశాల్
సినీ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఏ రాజు మృతి పట్ల ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో తనకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందని అన్నారు. మన మధ్య ఆయన లేరనే వార్త తనను కలచి వేసిందని చెప్పారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ... రాజుగారి అకాలమరణం తనను ఎంతో బాధిస్తోందని అన్నారు. సినిమా పట్ల మీరు చూపించే ప్రేమను ఇకపై తామంతా ఎంతో మిస్ అవుతామని చెప్పారు. ప్రతి ఒక్కరి కోసం ఇంతకాలం మీరు నిలిచారని అన్నారు.

హీరో విశాల్ మాట్లాడుతూ... తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రాజుగారు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన సోదరుడు, స్నేహితుడైన రాజు మరణవార్తతో తన హృదయం ముక్కలైందని అన్నారు.
Balakrishna
BA Raju
Prakash Raj
Vishal

More Telugu News